జులై 30, 2023

Lalitaa Devi Harathi Song | పున్నమి వెన్నెల దినములలోన

 

పున్నమి వెన్నెల దినములలోన

-------------




పున్నమి వెన్నెల దినములలోన
విరిసిన మల్లెల పూవులతోన
లలితాదేవిని మనమంతా
పూజించెదమూ రారమ్మా ||పున్నమి||

వజ్రాల పీట వేశామమ్మా
పీతాంబరములు పరిచామమ్మా
రంగవల్లులు వేశామూ
మామిడి తోరణాలు కట్టామూ ||పున్నమి||

శక్తి స్వరూపిణి నీవమ్మా
శ్రీ చక్రవానివి రావమ్మా
కుంకుమ పూజలు నీకమ్మా
మీ దీవెనలూ మాకమ్మా ||పున్నమి||

మెడలో ముత్యాల హారముతో
కరముల నవరత్న గాజులతో
నడుమున బంగారు వడ్డాణముతో
ఘల్లుఘల్లున రావమ్మా ||పున్నమి||

దూపదీప నైవేద్యములు
పాలు, శక్కర, ఫలములతో
పంచ భక్ష పాయసములతో
అర్పించెదమూ రావమ్మా ||పున్నమి||

వరముల నిచ్చును వనజాక్షి
జ్ఞానము నిచ్చును జలజాక్షి
కైవల్యమిచ్చును కామాక్షి
మోక్షమునిచ్చును మీనాక్షి ||పున్నమి||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Krishna Haarathi Song | కృష్ణుడి హారతి పాట

  జయ జగదీశ హరే కృష్ణా జయ జగదీశ హరే ------------------ జయ జగదీశ హరే కృష్ణా జయ జగదీశ హరే జయ గురు మారుత మందిరనాథా జయ జగదీశ హరే కింకిణి పదకమలా క...