సెప్టెంబర్ 30, 2022

Gayatri Haarathi Song | హారతి గొనుమా గాయత్రి

 గాయత్రి హారతి పాట

=======================


హారతి గొనుమా గాయత్రి
జగములనేలే జనయిత్రి

మంత్రస్వరూపిణి నీవమ్మా
వేదమాతవు నీవమ్మా ||మంత్రస్వరూపిణి||

ఆది అంతము మూలమునీవే
ఆదిశక్తివి నీవమ్మ ||ఆది అంతము|| ||హారతి గొనుమా||

పంచవదనివి నీవమ్మా
పద్మాసనవు నీవమ్మా ||పంచవదనివి||

అరుణప్రకాశిని అంబా నీవే
ఆనంద రూపిణి నీవమ్మా ||అరుణప్రకాశిని|| ||హారతి గొనుమా||


సెప్టెంబర్ 29, 2022

Sree Lalitha Haarathi Song | శ్రీ లలితా శివజ్యోతి | హారతి పాట


శ్రీ లలితా హారతి పాట
=========================



శ్రీ లలితా శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి
నిలయ నిరామయా సర్వమంగళా ||శ్రీ లలితా||

జగముల చిరునగవుల పరిపాలించే జననీ
అనయము మము కనికరమున కాపడే జననీ

మనసే నీ వశమై స్మరణే జీవణమై మాయని వర
మీయవె పరమేశ్వరి మంగళ నాయకి ||శ్రీ లలితా||

అందరి కన్నా చక్కని తల్లికి సూర్య హారతీ
అందాలేలే చల్లిని తల్లికి చంద్ర హారతీ

రవ్వల తళకుల కలకల లాడే కర్పూర హారతీ
సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళ హారతీ ||శ్రీ లలితా||


సెప్టెంబర్ 27, 2022

Annapurna Devi Song | ఆన్నపూర్ణా దేవి పాట

అన్నపూర్ణా దేవి పాట

===============


అన్నపూర్ణా దేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించి ననుబ్రోవువమ్మ ||2||
విశ్వైకనాథుడే విచ్చేయునంట నీ ఇంటిముంగిట నిలుచుండునంట ||అన్నపూర్ణా దేవి||

నా తనువునోతల్లి నీ సేవకొరకు అర్చింతునోయమ్మ పైజన్మవరకు ||2||
నా తనువు అచలాంశ నీ పురముచేరి నీ పాదముద్రతో నెగడాలి తల్లి ||అన్నపూర్ణా దేవి||

నా తనువు ఉదకాంశ నీ వీడు చేరి నీ పాదపద్మాలు కడగాలి తల్లి ||2||
నా తనువు తెజోంశ నీ గుడికి చేరి నీ ముందు దివ్వెగా నిలవాలి తల్లి ||అన్నపూర్ణా దేవి||

నా తనువు మరుదంశ నీ గుడికి చేరి నీ చూపు కొసలతో విసరాలి తల్లి ||2||
నా తనువు గగనాంశ నీ మనికి చేరి నీ నామ గానాలు మ్రోయాలి తల్లి ||అన్నపూర్ణా దేవి||



Saraswati devi song | సరస్వతి దేవి పాట

సరస్వతి దేవి పాట
====================


హంసవాహన దేవి అంబా సరస్వతి ||హంస||

అఖిలలోక కళావాణి అంబా సరస్వతి ||హంస||

భ్రుంగశైలవాసిని అంబా సరస్వతి ||భ్రుంగశైలవాసిని||
సంగీత రస విలాసినీ అంబా సరస్వతి ||సంగీత|| ||హంస||

సంగీత రసీకే అంబా సరస్వతి ||సంగీత రసీకే||
సదానంద రూపే అంబా సరస్వతి ||సదానంద రూపే|| ||హంస||

భావ రాగ వినోదిని అంబా సరస్వతి ||భావ రాగ||
భక్త కల్ప రసీకే అంబా సరస్వతి ||భక్త కల్ప|| ||హంస||

 

Lakshmi Devi mangala Harathi | లక్ష్మీ దేవి మంగళహారతి పాట

 లక్ష్మీ దేవి మంగళహారతి పాట

=====================


ఎంత చక్కనిదానవమ్మ శ్రీ మహాళక్ష్మి

మంగళ హారతి గైకొనవమ్మ శ్రీ మహాళక్ష్మి ||ఎంత చక్కని||

ఎపుడు హరిపురమేనా తల్లి
మా ఇంటికి ఒకపరి రావమ్మా ||ఎపుడు హరిపురమేనా||
పసుపు కుంకుమ పువ్వులు గాజులు
వాయనమిచ్చెదనమ్మా ||పసుపు కుంకుమ|| ||ఎంత చక్కని||

కరుణించి కనకము వర్షించు
సద్వినియోగము చేసెదనమ్మా ||కరుణించి||
నిత్యసుమంగళిగా దీవించు
నిరతము నిను పూజించెదనమ్మా ||నిత్యసుమంగళిగా|| ||ఎంత చక్కని||


Balatripurasundari Paata | బాలా త్రిపురసుందరీ పాట

 బాలా త్రిపురసుందరీ పాట

==================



బాలా త్రిపురసుందరీ గైకొనుమా హారతీ ||2||
గాన లోల జాలమేల జాలిచూపుమా ||2||

సుందరాంగీ అందరూ నీసాటిరారుగా ||2||
సందేహములు అందముగా తీర్పుమంటివి ||2|| ||బాలా||

వాసికెక్కియున్న దానవనుచు నమ్మితి ||2||
రాశిగ సిరిసంపదలునిచ్చి బ్రోవుమంటివి ||2|| ||బాలా||

ఓం, హ్రీం, శ్రీం అనుచు మదిని తలచు చుంటిమి ||2||
ఆపదలెడ బాపవమ్మ అతివ సుందరి ||2|| ||బాలా||

స్థిరముగ శ్రీ కడలియందు వెలసితివమ్మ ||2||
ధరణిలో శ్రీరంగదాసుని దయను చూడుమా ||2|| ||బాలా||


Krishna Haarathi Song | కృష్ణుడి హారతి పాట

  జయ జగదీశ హరే కృష్ణా జయ జగదీశ హరే ------------------ జయ జగదీశ హరే కృష్ణా జయ జగదీశ హరే జయ గురు మారుత మందిరనాథా జయ జగదీశ హరే కింకిణి పదకమలా క...