ఇద్దరక్క చెళ్ళెల్లు పాట
ఇద్దరక్క చెళ్ళెల్లు ఉయ్యాలో
ఒక్కూరికిచ్చిరి ఉయ్యాలో
ఒక్కడే మాయన్న ఉయ్యాలో
వచ్చన్నాపోడు ఉయ్యాలో
ఎట్లొత్తు చెళ్ళెలా ఉయ్యాలో
ఏరడ్డామాయె ఉయ్యాలో
ఏరుకు ఎంపల్లి ఉయ్యాలో
తోటడ్డామాయె ఉయ్యాలో
తోటకు తొంబాయి ఉయ్యాలో
తలుపులడ్డామాయె ఉయ్యాలో
తలుపులకు తాలాలు ఉయ్యాలో
వెండి శీలాలు ఉయ్యాలో
వెండి శీలాలనడుమ ఉయ్యాలో
ఎలపత్తి చెట్టు ఉయ్యాలో
ఎలపత్తి చెట్టుకు ఉయ్యాలో
ఏడే మొగ్గలు ఉయ్యాలో
ఏడే మొగ్గల పత్తి ఉయ్యాలో
ఆ పత్తి ఈ పత్తి ఉయ్యాలో
కలరాసి పోసి ఉయ్యాలో
నెసెనే ఆ చీర ఉయ్యాలో
నెలకొక్క పోగు ఉయ్యాలో
దించెనే ఆ చీర ఉయ్యాలో
దివిటీలమీద ఉయ్యాలో
ఆ చీర కట్టుకోని ఉయ్యాలో
కొంగలా బావికి ఉయ్యాలో
కొంగలా బావికీ ఉయ్యాలో
నీళ్ళకాని పోతే ఉయ్యాలో
కొంగలన్ని గూడి ఉయ్యాలో
కొంగంతా చూసే ఉయ్యాలో
ఆ చీర కట్టుకోని ఉయ్యాలో
హంసలా బావికి ఉయ్యాలో
హంసలా బావికీ ఉయ్యాలో
నీళ్ళకాని పోతే ఉయ్యాలో
హంసల్లన్ని గూడి ఉయ్యాలో
అంచంతా చూసే ఉయ్యాలో
ఆ చీర కట్టుకోని ఉయ్యాలో
చిలకలా బావికి ఉయ్యాలో
చిలకలా బావికీ ఉయ్యాలో
నీళ్ళకాని పోతే ఉయ్యాలో
చిలకలన్నీ గూడి ఉయ్యాలో
చీరంతా చూసే ఉయ్యాలో
ఆ చీర కట్టుకోని ఉయ్యాలో
పట్నంకు పోతె ఉయ్యాలో
పట్నంలో ఆడోల్లు ఉయ్యాలో
మాకొక్కటానిరీ ఉయ్యాలో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి