కలవారి కోడలు పాట
కలవారి కోడలు ఉయ్యాలో
కలికి కామాక్షి ఉయ్యాలో
కడుగుతున్నది పప్పు ఉయ్యాలో
కడవలో పోసింది ఉయ్యాలో
అంతట్లొ అన్నలు ఉయ్యాలో
రానే వచ్చిరి ఉయ్యాలో
కాళ్ళకు నీళ్ళిచ్చి ఉయ్యాలో
కన్నీరు నింపె ఉయ్యాలో
ఎందుకు కన్నీరు ఉయ్యాలో
ఏమి కష్టములు ఉయ్యాలో
తుడుచుకో కన్నీరు ఉయ్యాలో
ముడుచుకో కురులు ఉయ్యాలో
పోయి మీవాళ్ళతో ఉయ్యాలో
చెప్పిరావమ్మ ఉయ్యాలో
వంటసాలెలున్న ఉయ్యాలో
ఓ అక్కగారు ఉయ్యాలో
మా అన్నలొచ్చారు ఉయ్యాలో
మమ్ము అంపుతారా ఉయ్యాలో
వస్తె వచ్చిరిగాని ఉయ్యాలో
ఏమి దెచ్చినారు ఉయ్యాలో
పాపడికి పట్టంగి ఉయ్యాలో
పలుదాగే గిన్నె ఉయ్యాలో
నాకు నల్లా చీరె ఉయ్యాలో
నెమలంచు రైకె ఉయ్యాలో
అందరికి తెచ్చిండ్రు ఉయ్యాలో
ఎంతో కొంత ఉయ్యాలో
నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో
మీ బావనడుగు ఉయ్యాలో
భారతము చదివేటి ఉయ్యాలో
బావ పెద్దా బావ ఉయ్యాలో
మా అన్నలొచ్చారు ఉయ్యాలో
మమ్ము అంపుతార ఉయ్యాలో
నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో
మీ అత్తనడుగు ఉయ్యాలో
కుర్చి పీటల మీద ఉయ్యాలో
కుర్చున్న ఓ అత్త ఉయ్యాలో
మా అన్నలొచ్చారు ఉయ్యాలో
మమ్ము అంపుతార ఉయ్యాలో
వస్తె వచ్చిరిగాని ఉయ్యాలో
ఏమి దెచ్చినారు ఉయ్యాలో
పాపడికి పట్టంగి ఉయ్యాలో
పలుదాగే గిన్నె ఉయ్యాలో
నాకు నల్లా చీరె ఉయ్యాలో
నెమలంచు రైకె ఉయ్యాలో
అందరికి తెచ్చిండ్రు ఉయ్యాలో
ఎంతో కొంత ఉయ్యాలో
నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో
మీ మామనడుగు ఉయ్యాలో
పట్టె మంచం మీద ఉయ్యాలో
పడుకున్న ఓ మామ ఉయ్యాలో
మా అన్నలొచ్చారు ఉయ్యాలో
మమ్ము అంపుతార ఉయ్యాలో
నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో
మీ వారినడుగు ఉయ్యాలో
రచ్చలో కుర్చున్న ఉయ్యాలో
రాజేంద్ర భోగి ఉయ్యాలో
మా అన్నలొచ్చారు ఉయ్యాలో
మమ్ము అంపుతార ఉయ్యాలో
ముడుచుకో కురులు ఉయ్యాలో
కట్టుకో చీరలు ఉయ్యాలో
పెట్టుకో సొమ్ములు ఉయ్యాలో
ఎత్తుకో పాపడిని ఉయ్యాలో
పొయిరా సుఖముగా ఉయ్యాలో
పుట్టినింటికినీ ఉయ్యాలో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి