సీతమ్మ శ్రీరాములు పాట
సీతమ్మ శ్రీరాములు ఉయ్యాలో
సారీ బయలెల్లె ఉయ్యాలో
పారిజాతం పూలు ఉయ్యాలో
పరిమేళమిచ్చె ఉయ్యాలో
పోవయ్య రఘురామ ఉయ్యాలో
తేవయ్య పూలు ఉయ్యాలో
మన తోట కాదు సీత ఉయ్యాలో
మన్నెవారి తోట ఉయ్యాలో
మనకంటె మిక్కిలి ఉయ్యాలో
మన్నేవారెవరు ఉయ్యాలో
పోయెనే ఆ సీత ఉయ్యాలో
తోటా వద్దకు ఉయ్యాలో
కట్టుకున్న కై చీర ఉయ్యాలో
కాశల్లు పోసె ఉయ్యాలో
తొడుకున్న పట్టురైక ఉయ్యాలో
బొడ్లల్ల చెక్కె ఉయ్యాలో
కొమ్మాకదలాకుండ ఉయ్యాలో
చెట్టు ఎక్కినాది ఉయ్యాలో
ఆకు కదలాకుండ ఉయ్యాలో
పువ్వు తెంపినాది ఉయ్యాలో
అంతట్ల తోటమాలి ఉయ్యాలో
తోటా వద్దకు ఉయ్యాలో
తోటలున్నావారు ఉయ్యాలో
ఎవరమ్మా మీరు ఉయ్యాలో
శ్రీరాముల భార్యను ఉయ్యాలో
సీతాదేవిని ఉయ్యాలో
దశరథుని కోడల్ని ఉయ్యాలో
జనకుని పుత్రికను ఉయ్యాలో
అట్లైతె మా ఇంటికి ఉయ్యాలో
పెద్దా కోడలివి ఉయ్యాలో
హర హరా ఈ తోట ఉయ్యాలో
అగ్గయ్యి పోను ఉయ్యాలో
శివ శివా ఈ తొట ఉయ్యాలో
శిచ్చయ్యి పోను ఉయ్యాలో
బుగ బుగ ఈ తోట ఉయ్యాలో
బూడిదయ్యి పోను ఉయ్యాలో
శివుడికి ఈ పూలు ఉయ్యాలో
ఎక్కాక పోని ఉయ్యాలో
భూమ్మీద ఈ పూలు ఉయ్యాలో
పుట్టాక పోని ఉయ్యాలో
ముత్తైదువులు ఈ పూలు ఉయ్యాలో
ముడవకాపోని ఉయ్యాలో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి