మార్చి 17, 2021

వెంకటేశ్వరుని పాట - Venkateshwaruni Paata - Sheelaguna Maaruthi Sweekarinchu Haarathi

Rama in Tirumala


శీలగునా మారుతీ స్వీకరించు హారతి

పాలనమ్ము చేయరమ్ము

పాదములను జేరితీ

జాలిపడితి మోసపోతి

సమయమిదేనమ్మితి

కాలదూతలాడు కూతలూనుచేయ మరచితి

ప్రాలుమాలతీ, కేలుముగిసితి

పదములనే మ్రొక్కితి

బాలికనై వేడితి  ||శీలగునా||


సంగరమున రక్కసులను చాల సృక్కచేసితి

ప్రొంగుచున్, ప్రొంగుచున్ పురమునెల్ల గాంచితిని

సంగాహితుడవై, స్వామిహితుడవై

మంగలంబులొసగుమా

మమ్ము దయన్ గావుమా మా పూజలనందుమా  ||శీలగునా||


నీవనంతసాగరగిరి, నిలచిరాజమౌళిని

కావగన్, సెవలన్ని, చేయుచుండువారిని

నీవే బ్రహ్మవు, నీవే హరుడవు, నీవే గొవిందుడవు, నీవెల్లర,గావుమా

మా పూజలనందుమా ||శీలగునా|| 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Krishna Haarathi Song | కృష్ణుడి హారతి పాట

  జయ జగదీశ హరే కృష్ణా జయ జగదీశ హరే ------------------ జయ జగదీశ హరే కృష్ణా జయ జగదీశ హరే జయ గురు మారుత మందిరనాథా జయ జగదీశ హరే కింకిణి పదకమలా క...