సముర్థ పాట
===============
సువ్వియనుచు పాడరమ్మా సుందరాంగిణి చూడరమ్మా
తెల్లచీరకట్టెనమ్మా, తెల్లరవిక తొడిగెనమ్మా
తోయజాక్షి ఎరగదమ్మా తల్లిచూసి చెప్పగానె
తలవంచి నవ్వెనమ్మా ||సువ్వియనుచు||
నవ్వు మాటే కాదేకొమ్మా నాతిసముర్తలాడేనమ్మా ||సువ్వియనుచు||
పచ్చీఅకు పరువరమ్మా పాలవెన్న తేగదమ్మా
పనతికి అందించరమ్మా ||సువ్వియనుచు||
విప్రవరున్ని పిలువరమ్మా విప్పి పంచాంగము చూడరమ్మా
విప్పి పంచాంగము చూడగానే ఉత్తమైన నక్షత్రమమ్మా ||సువ్వియనుచు||
బంగారు పసిడి రోళ్ళ పసుపుకొమ్ము రోకలుంచి
పంచదార కొబ్బరేసి పనతులందరికీ పంచరమ్మా ||సువ్వియనుచు||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి