సత్యనారాయణా స్వామి హారతి పాట - 1
=========
సత్యనారాయణా స్వామికి మనమంతా నిత్యామంగళమానరే,
ఓ జనులారా సత్యామంగళామానరే ||సత్యనారాయణా||
ఆవుపేడలు తెచ్చి పచ్చాటి కళ్ళాపీచల్లి
పగడిముగ్గులు వేయారే, ఓ జనులారా పగడిముగ్గులు వేయారే ||సత్యనారాయణా||
తట్టుపీటలు తెచ్చి, పట్టుబట్టలు పరచి
సన్న బియ్యముపోయరే, ఓ జనులారా సన్న బియ్యముపోయరే ||సత్యనారాయణా||
ఛెంబు కలశముగట్టి, టెంకాయ పూజా చేసి
ఒంగి దండముచేయరే, ఓ జనులారా ఒంగి దండముచేయరే ||సత్యనారాయణా||
అర్ధశేరు గోధుమ రవ్వ, తీనుపావు పంచాదారా
పండ్లుఫలహారములు కలుపరే, ఓ జములారా పండ్లుఫలహారములు ||సత్యనారాయణా||
కీరు పూరీ చేసీ నైవేద్యముజూపి,
ఒక్కాపొద్దులు విడువరే, ఓ జనులారా ఒక్కాపొద్దులు విడువరే ||సత్యనారాయణా||
కోరినవారికి, కొడుకులను వరమిచ్చి
కొటి సంపతి కలుగునే, ఓ జనులారా కొటి సంపతి కలుగునే ||సత్యనారాయణా||
అడిగినవారికీ
అధిక సంపతి కలుగునే, ఓ జనులారా అధిక సంపతి కలుగునే ||సత్యనారాయణా||
సత్యనారాయణా స్వామి హారతి పాట - 2
=========
సత్యనారాయణా పూజలుచేసిన
పాపం పరిహారం ఇలలో పాపం పరిహారం ||సత్యనారాయణా||
నిరతము, నిను కొలిచినవారికి
ఆశలు తీర్చెదవోదెవా ||సత్యనారాయణా||
పున్నమిరోజున, పుడమిలో జనులు
సత్యనారాయణా పూజలు చేసెదరు ||సత్యనారాయణా||
విష్ణువు నీవే బ్రహ్మవు నీవే మహేశ్వరుడవు నీవే
ఆరాగముతో అనురాగముతో
ఆశలు తీర్చెదవోదేవా ||సత్యనారాయణా||
సత్యనారాయణా స్వామి హారతి పాట - 3
=========
శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా
మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా ||శ్రీ||
నోచిన వారికి నోచిన వరము
చూసిన వారికి చూసిన ఫలము ||శ్రీ||
స్వామిని పూజించే చేతులే చేతులటా
ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులటా
తన కథ వింటే ఎవ్వరికైనా జన్మతరించునటా ||శ్రీ||
ఏ వేళైనా, ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం
అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం ||శ్రీ||
అర్చన చేద్దామా, మనసు అర్పణ చేద్దామా
స్వామికి మదిలోనే, కొవెల కడదామా
పదికాలాలు పసుపు కుంకుమలు, ఇమ్మని కోరెదమా ||శ్రీ||
మంగళమనరమ్మా, జయమంగళమనరమ్మా
కరములు జొడించి, శ్రీ చందనమనరించీ
వందనమనరే సుందరమూర్తికి, వందనమనరమ్మా ||శ్రీ||