నవంబర్ 24, 2021

Totle paata - Uyyala paata | తొట్లె/ఉయ్యాల పాట

 తొట్లె/ఉయ్యాల పాట

==========



ఉయ్యాలలూచెదరారా వయ్యారి రాధకృష్ణా

వయ్యారి రాధకృష్ణా సయ్యాటలాడుచు రారా


బంగారు ఉయ్యలలోనా శృంగారమైన పాన్పు

శృంగారమైన పాన్పు అంగాను లేచినారు ||ఉయ్యాల||


అద్దాల తొట్లెలోన ఆట్లాడి అలసినావు

ఆట్లాడి అలసినావు హాయిగా నిదురా పొమ్మి ||ఉయ్యాల||


దంతాపుటుయ్యలలోనా నవరాత్న ఖచితంబైన

నవరాత్న ఖచితంబైన మెత్తాని పరుపులపైనా ||ఉయ్యాల||


కామ, క్రొద, లోభమూలు కలిపి వత్తీగవేసి

ప్రేమయనేటి చమురూ పోసి, ప్రభుడవాని హారతిత్తు ||ఉయ్యాల||



Jola Paata | జోల పాట

జోల పాట

==========



జోజోయని ఊచెద జోయని పాడెద

నిదురాపోవమ్మా కృష్ణమ్మ

అల్లరి చేయకుమా  ||జోజోయని||


బంగరు తొట్లెల లోపల పానుపు పరిచెద

వేగమె పరుగిడి ప్రవలింపుమా కృష్ణమ్మ

అల్లరి చేయకుమా  ||జోజోయని||


మల్లెలు మొల్లలు మంచివిరాజాజులు

మాలా గ్రుచ్చెదను కృష్ణమ్మ

అల్లరి చేయకుమా  ||జోజోయని||


కర్పూర హారతి శుభమంగళము

కొనియాడెదను కృష్ణమ్మ

అల్లరి చేయకుమా  ||జోజోయని|| 


Seemantham Song | సీమంతం పాట

 సీమంతం పాట

===========



ఒకటో మాసము నెలతొని గర్భిణి ||ఒకటో||

వేవ్విళ్ళె మొదలాయె చెలియా ||వేవ్విళ్ళె||


రెండో మాసము నెలతొని గర్భిణి ||రెండో||

రేగీ పండడిగే చెలియా ||రేగీపండడిగే||


మూడో మాసము నెలతొని గర్భిణి ||మూడో||

మామిడి పండడిగే చెలియా ||మామిడి||


నాల్గో మాసము నెలతొని గర్భిణి ||నాల్గో||

నారింజ పండడిగే చెలియా ||నారింజ||


ఐదో మాసము నెలతొని గర్భిణి ||ఐదో||

అంజీర పండడిగే చెలియా ||అంజీర||


ఆరో మాసము నెలతొని గర్భిణి ||ఆరో||

అరటీ పండడిగే చెలియా ||అరటీ||


ఏడో మాసము నెలతొని గర్భిణి ||ఏడో||

ఎలిగే పండడిగే చెలియా ||ఎలిగే||


ఎనిమిదో మాసము నెలతొని గర్భిణి ||ఎనిమిదో||

నేరేడు పండడిగే చెలియా ||నేరేడు||


తొమ్మిదో మాసము నెలతొని గర్భిణి ||తొమ్మిదో||

దానిమ్మ పండడిగే చెలియా ||దానిమ్మ||


పదో మాసము నెలతొని గర్భిణి ||పదో||

పండంటి బాబునిచ్చె/పాపనిచ్చె చెలియా ||పండంటి||

 


సెప్టెంబర్ 19, 2021

14. Bathukamma Songs - Chittu Chittula Bomma Song | చిత్తు చిత్తుల బొమ్మ పాట

 చిత్తు చిత్తుల బొమ్మ పాట


చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దులగుమ్మ

బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన

చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దులగుమ్మ

బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన


రాగి బిందె తీసుక రమణి నీళ్ళకు పోతే

రాములోరు ఎదురాయెనమ్మో ఈ వాడలోన

చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దులగుమ్మ

బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన


వెండి బిందె తీసుక వెలది నీళ్ళకు పోతే

వెంకటేశుడెదురాయెనమ్మో ఈ వాడలోన 

చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దులగుమ్మ

బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన


బంగారు బిందె తీసుక భామ నీళ్ళకు పోతే

భగవంతుడెదురాయెనమ్మో ఈ వాడలోన

చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దులగుమ్మ

బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన


పగిడి బిందె తీసుక పడతి నీళ్ళకు పోతే

పరమేశుడెదురాయెనమ్మో ఈ వాడలోన

చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దులగుమ్మ

బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన


ముత్యాల బిందె తీసుక ముదిత నీళ్ళకు పోతే

ముద్దుకృష్ణుడెదురాయెనమ్మో ఈ వాడలోన

చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దులగుమ్మ

బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన


13. Bathukamma Songs - Gouramma Flower Song | గౌరమ్మ పువ్వు పాట

 గౌరమ్మ పువ్వు పాట



ఏమేమి పువ్వొప్పునో గౌరమ్మ

ఏమేమి కాయొప్పునో గౌరమ్మ

తంగేడు పువ్వొప్పునో గౌరమ్మ

తంగేడు కాయొప్పునో గౌరమ్మ

తంగేడు చెట్టుకింద ఆట చిలకాలాలా పాట చిలకాలాలా

కలికి చిలకాలాలా కందువ్వలాలా

గణమైన పొన్న పువ్వే గౌరమ్మ

గజ్జాల ఒడ్డాణమే గౌరమ్మ


ఏమేమి పువ్వొప్పునో గౌరమ్మ

ఏమేమి కాయొప్పునో గౌరమ్మ

గుమ్మాడి పువ్వొప్పునో గౌరమ్మ

గుమ్మాడి కాయొప్పునో గౌరమ్మ

గుమ్మాడి చెట్టుకింద ఆట చిలకాలాలా పాట చిలకాలాలా

కలికి చిలకాలాలా కందువ్వలాలా

గణమైన పొన్న పువ్వే గౌరమ్మ

గజ్జాల ఒడ్డాణమే గౌరమ్మ


ఏమేమి పువ్వొప్పునో గౌరమ్మ

ఏమేమి కాయొప్పునో గౌరమ్మ

రుద్రాక్ష పువ్వొప్పునో గౌరమ్మ

రుద్రాక్ష కాయొప్పునో గౌరమ్మ

రుద్రాక్ష చెట్టుకింద ఆట చిలకాలాలా పాట చిలకాలాలా

కలికి చిలకాలాలా కందువ్వలాలా

గణమైన పొన్న పువ్వే గౌరమ్మ

గజ్జాల ఒడ్డాణమే గౌరమ్మ


ఏమేమి పువ్వొప్పునో గౌరమ్మ

ఏమేమి కాయొప్పునో గౌరమ్మ

కాకర పువ్వొప్పునో గౌరమ్మ

కాకర కాయొప్పునో గౌరమ్మ

కాకర చెట్టుకింద ఆట చిలకాలాలా పాట చిలకాలాలా

కలికి చిలకాలాలా కందువ్వలాలా

గణమైన పొన్న పువ్వే గౌరమ్మ

గజ్జాల ఒడ్డాణమే గౌరమ్మ


ఏమేమి పువ్వొప్పునో గౌరమ్మ

ఏమేమి కాయొప్పునో గౌరమ్మ

చామంతి పువ్వొప్పునో గౌరమ్మ

చామంతి కాయొప్పునో గౌరమ్మ

చామంతి చెట్టుకింద ఆట చిలకాలాలా పాట చిలకాలాలా

కలికి చిలకాలాలా కందువ్వలాలా

గణమైన పొన్న పువ్వే గౌరమ్మ

గజ్జాల ఒడ్డాణమే గౌరమ్మ


నీనోము నీకిత్తుమే గౌరమ్మ

మా నోము మాకియ్యవే గౌరమ్మ


12. Bathukamma Songs - Gouramma Song | గౌరమ్మ పాట

 గౌరమ్మ పాట



ఇసుకల పుట్టె గౌరమ్మ 

ఇసుకల పెరిగే గౌరమ్మ

పొన్నాగంటి తాళ్ళు

పోకలవంటి వనమూలు

వనముల చిలకలు గలగల తిరిగితే

వనమంతా తిరిగే గౌరూ

వాడంతా తిరిగే 


పసుపుల పుట్టె గౌరమ్మ 

పసుపుల పెరిగే గౌరమ్మ

పొన్నాగంటి తాళ్ళు

పోకలవంటి వనమూలు

వనముల చిలకలు గలగల తిరిగితే

వనమంతా తిరిగే గౌరూ

వాడంతా తిరిగే 


కుంకుమల పుట్టె గౌరమ్మ 

కుంకుమల పెరిగే గౌరమ్మ

పొన్నాగంటి తాళ్ళు

పోకలవంటి వనమూలు

వనముల చిలకలు గలగల తిరిగితే

వనమంతా తిరిగే గౌరూ

వాడంతా తిరిగే 


గంధంల పుట్టె గౌరమ్మ 

గంధంల పెరిగే గౌరమ్మ

పొన్నాగంటి తాళ్ళు

పోకలవంటి వనమూలు

వనముల చిలకలు గలగల తిరిగితే

వనమంతా తిరిగే గౌరూ

వాడంతా తిరిగే 


అక్షింతల పుట్టె గౌరమ్మ 

అక్షింతల పెరిగే గౌరమ్మ

పొన్నాగంటి తాళ్ళు

పోకలవంటి వనమూలు

వనముల చిలకలు గలగల తిరిగితే

వనమంతా తిరిగే గౌరూ

వాడంతా తిరిగే


11. Bathukamma Songs - Chandamama Song | చందమామ పాట

 చందమామ పాట



ఒక్కేసి పూవ్వేసి చందమామ

ఒక్క జాములాయె చందమామ

జాముజాముకూ చందమామ

శివుడు రాకాపాయే చందమామ


రెండేసి పూలేసి చందమామ

రెండు జాములాయె చందమామ

జాముజాముకూ చందమామ

శివుడు రాకాపాయే చందమామ


మూడేసి పూలేసి చందమామ

మూడు జాములాయె చందమామ

జాముజాముకూ చందమామ

శివుడు రాకాపాయే చందమామ


నాలుగేసి పూలేసి చందమామ

నాలుగు జాములాయె చందమామ

శివపూజ వేలాయె చందమామ

శివుడు రాకాపాయే చందమామ


ఐదేసి పూలేసి చందమామ

ఐదు జాములాయె చందమామ

శివపూజ వేలాయె చందమామ

శివుడొచ్చి కూర్చునే చందమామ


10. Bathukamma Songs - Lakshmi Devi Song | లక్ష్మీ దేవి పాట

లక్ష్మీ దేవి పాట




శుక్రవారం లక్ష్మీ ఉయ్యాలో
మా ఇంటికొస్తెను ఉయ్యాలో
పసుపు కుంకుమలతో ఉయ్యాలో
నేనెదురుకుందును ఉయ్యాలో

శనివారం లక్ష్మీ ఉయ్యాలో
మా ఇంటికొస్తెను ఉయ్యాలో
చేమంతిపూలతో ఉయ్యాలో
నేనెదురుకుందును ఉయ్యాలో

ఆదివారం లక్ష్మీ ఉయ్యాలో
మా ఇంటికొస్తెను ఉయ్యాలో
అత్తరు పన్నీరుతో ఉయ్యాలో
నేనెదురుకుందును ఉయ్యాలో

సోమవారం లక్ష్మీ ఉయ్యాలో
మా ఇంటికొస్తెను ఉయ్యాలో
సొమ్ములా పెట్టెలతో ఉయ్యాలో
నేనెదురుకుందును ఉయ్యాలో

మంగళవారం లక్ష్మీ ఉయ్యాలో
మా ఇంటికొస్తెను ఉయ్యాలో
మంగళారతులతో ఉయ్యాలో
నేనెదురుకుందును ఉయ్యాలో

బుధవారం లక్ష్మీ ఉయ్యాలో
మా ఇంటికొస్తెను ఉయ్యాలో
బుక్కగుల్లాలతో ఉయ్యాలో
నేనెదురుకుందును ఉయ్యాలో

గురువారం లక్ష్మీ ఉయ్యాలో
మా ఇంటికొస్తెను ఉయ్యాలో
గుల్లెడు శనగలతో ఉయ్యాలో
నేనెదురుకుందును ఉయ్యాలో

9. Bathukamma Songs - Vadinagaari Song | వదినగారి పాట

 వదినగారి పాట



అందరోలే అడగజాలరు మా వదినగారు

కొందరోలే కొసరజాలరు మా వదినగారు


పల్లిచేను అమ్మ మంటది మా వదినగారు

పట్టుచీరెల్ దెమ్మంటది మా వదినగారు

అందరోలే అడగజాలరు మా వదినగారు

కొందరోలే కొసరజాలరు మా వదినగారు


రాగులచేను అమ్మ మంటది మా వదినగారు

రైకెలైన దెమ్మంటది మా వదినగారు

అందరోలే అడగజాలరు మా వదినగారు

కొందరోలే కొసరజాలరు మా వదినగారు


కందిచేను అమ్మ మంటది మా వదినగారు

కాళ్ళ కడియాలు దెమ్మంటది మా వదినగారు

అందరోలే అడగజాలరు మా వదినగారు

కొందరోలే కొసరజాలరు మా వదినగారు


వడ్ల చేను అమ్మ మంటది మా వదినగారు

వడ్డాణం దెమ్మంటది మా వదినగారు

అందరోలే అడగజాలరు మా వదినగారు

కొందరోలే కొసరజాలరు మా వదినగారు


చెరుకు తోట అమ్మ మంటది మా వదినగారు

చెవుల కమ్మలు దెమ్మంటది మా వదినగారు

అందరోలే అడగజాలరు మా వదినగారు

కొందరోలే కొసరజాలరు మా వదినగారు


మిరప చేను అమ్మ మంటది మా వదినగారు

మిరియాల గాజులు దెమ్మంటది మా వదినగారు

అందరోలే అడగజాలరు మా వదినగారు

కొందరోలే కొసరజాలరు మా వదినగారు

సెప్టెంబర్ 12, 2021

8. Bathukamma Songs - Andari Song | అందరి పాట

 అందరి పాట



రామ రామ రామ ఉయ్యాలో

రామనే శ్రీరామ ఉయ్యాలో

నెత్తిమీద సూర్యుడా ఉయ్యాలో

నెలవన్నేకాడ ఉయ్యాలో

పాపెట్ల చంద్రుడా ఉయ్యాలో

బాలకోమారుడా ఉయ్యాలో

పెద్దలకు వచ్చింది ఉయ్యాలో

పెత్తారామాస ఉయ్యాలో

బాలలకు వచ్చింది ఉయ్యాలో

బొడ్డెమ్మ పండుగ ఉయ్యాలో

ఆడోళ్ళకొచ్చింది ఉయ్యాలో

బతుకమ్మ పండుగ ఉయ్యాలో

మగవాళ్ళకు వచ్చింది ఉయ్యాలో

మోహంపు దసరా ఉయ్యాలో

రామ రామ రామ ఉయ్యాలో

రామనే శ్రీరామ ఉయ్యాలో

7. Bathukamma Songs - Saree Song | చీర పాట

 ఇద్దరక్క చెళ్ళెల్లు పాట



ఇద్దరక్క చెళ్ళెల్లు ఉయ్యాలో

ఒక్కూరికిచ్చిరి ఉయ్యాలో

ఒక్కడే మాయన్న ఉయ్యాలో

వచ్చన్నాపోడు ఉయ్యాలో

ఎట్లొత్తు చెళ్ళెలా ఉయ్యాలో

ఏరడ్డామాయె ఉయ్యాలో

ఏరుకు ఎంపల్లి ఉయ్యాలో

తోటడ్డామాయె ఉయ్యాలో

తోటకు తొంబాయి ఉయ్యాలో

తలుపులడ్డామాయె ఉయ్యాలో

తలుపులకు తాలాలు ఉయ్యాలో

వెండి శీలాలు ఉయ్యాలో

వెండి శీలాలనడుమ ఉయ్యాలో

ఎలపత్తి చెట్టు ఉయ్యాలో

ఎలపత్తి చెట్టుకు ఉయ్యాలో

ఏడే మొగ్గలు ఉయ్యాలో

ఏడే మొగ్గల పత్తి ఉయ్యాలో

ఆ పత్తి ఈ పత్తి ఉయ్యాలో

కలరాసి పోసి ఉయ్యాలో

నెసెనే ఆ చీర ఉయ్యాలో

నెలకొక్క పోగు ఉయ్యాలో

దించెనే ఆ చీర ఉయ్యాలో

దివిటీలమీద ఉయ్యాలో

ఆ చీర కట్టుకోని ఉయ్యాలో

కొంగలా బావికి ఉయ్యాలో

కొంగలా బావికీ ఉయ్యాలో

నీళ్ళకాని పోతే ఉయ్యాలో

కొంగలన్ని గూడి ఉయ్యాలో

కొంగంతా చూసే ఉయ్యాలో

ఆ చీర కట్టుకోని ఉయ్యాలో

హంసలా బావికి ఉయ్యాలో

హంసలా బావికీ ఉయ్యాలో

నీళ్ళకాని పోతే ఉయ్యాలో

హంసల్లన్ని గూడి ఉయ్యాలో

అంచంతా చూసే ఉయ్యాలో

ఆ చీర కట్టుకోని ఉయ్యాలో

చిలకలా బావికి ఉయ్యాలో

చిలకలా బావికీ ఉయ్యాలో

నీళ్ళకాని పోతే ఉయ్యాలో

చిలకలన్నీ గూడి ఉయ్యాలో

చీరంతా చూసే ఉయ్యాలో

ఆ చీర కట్టుకోని ఉయ్యాలో

పట్నంకు పోతె ఉయ్యాలో

పట్నంలో ఆడోల్లు ఉయ్యాలో

మాకొక్కటానిరీ ఉయ్యాలో


సెప్టెంబర్ 11, 2021

6. Bathukamma Songs - Yashoda Kala Song | యశోద కల పాట

 యశోద కల పాట


కలగంటి మానసా ఉయ్యాలో

కలగంటి సఖియ ఉయ్యాలో

ఏమి కగంటివే ఉయ్యాలో

యెశోదాదేవి ఉయ్యాలో

నిత్యంబు కల గంటి ఉయ్యాలో

నిజమేలుకొంటి ఉయ్యాలో

సత్యంబు కలగంటి ఉయ్యాలో

జగమేలుకొంటి ఉయ్యాలో

ఆది దంపతులు ఉయ్యాలో

నేగన్న కలలు ఉయ్యాలో

ఆది దంపతులు ఉయ్యాలో

నా తల్లిదండ్రులు ఉయ్యాలో

కలగంటి మానసా ఉయ్యాలో

కలగంటి సఖియ ఉయ్యాలో

పార్వతీపరమేశ్వరులు ఉయ్యాలో

నేగన్న కలలు ఉయ్యాలో

పార్వతీపరమేశ్వరులు ఉయ్యాలో

మా అత్తమామలు ఉయ్యాలో

కలగంటి మానసా ఉయ్యాలో

కలగంటి సఖియ ఉయ్యాలో

శ్రీదేవి భూదేవి ఉయ్యాలో

నేగన్న కలలు ఉయ్యాలో

శ్రీదేవి భూదేవి ఉయ్యాలో

మా ఆడపడుచులు ఉయ్యాలో

కలగంటి మానసా ఉయ్యాలో

కలగంటి సఖియ ఉయ్యాలో

శ్రీగౌరి శ్రీలలిత ఉయ్యాలో

నేగన్న కలలు ఉయ్యాలో

శ్రీగౌరి శ్రీలలిత ఉయ్యాలో

మా ఒదినె మరదల్లు ఉయ్యాలో

కలగంటి మానసా ఉయ్యాలో

కలగంటి సఖియ ఉయ్యాలో

శ్రీలక్ష్మి భూలక్ష్మి ఉయ్యాలో

నేగన్న కలలు ఉయ్యాలో

శ్రీలక్ష్మి భూలక్ష్మి ఉయ్యాలో

మా అక్క చెళ్ళెల్లు ఉయ్యాలో

కలగంటి మానసా ఉయ్యాలో

కలగంటి సఖియ ఉయ్యాలో

సూర్యచంద్రాజులు ఉయ్యాలో

నేగన్న కలలు ఉయ్యాలో

సూర్యచంద్రాజులు ఉయ్యాలో

నా అన్నదమ్ముళ్ళు ఉయ్యాలో

కలగంటి మానసా ఉయ్యాలో

కలగంటి సఖియ ఉయ్యాలో

ఇంద్రుడు చంద్రుడు ఉయ్యాలో

నేగన్న కలలు ఉయ్యాలో

ఇంద్రుడు చంద్రుడు ఉయ్యాలో

మా బావ మరుదులు ఉయ్యాలో

కలగంటి మానసా ఉయ్యాలో

కలగంటి సఖియ ఉయ్యాలో

5. Bathukamma Songs - Kalavaari Kodalu Song | కలవారి కోడలు పాట

 కలవారి కోడలు పాట

కలవారి కోడలు ఉయ్యాలో

కలికి కామాక్షి ఉయ్యాలో

కడుగుతున్నది పప్పు ఉయ్యాలో

కడవలో పోసింది ఉయ్యాలో

అంతట్లొ అన్నలు ఉయ్యాలో

రానే వచ్చిరి ఉయ్యాలో

కాళ్ళకు నీళ్ళిచ్చి ఉయ్యాలో

కన్నీరు నింపె ఉయ్యాలో

ఎందుకు కన్నీరు ఉయ్యాలో

ఏమి కష్టములు ఉయ్యాలో

తుడుచుకో కన్నీరు ఉయ్యాలో

ముడుచుకో కురులు ఉయ్యాలో

పోయి మీవాళ్ళతో ఉయ్యాలో

చెప్పిరావమ్మ ఉయ్యాలో

వంటసాలెలున్న ఉయ్యాలో

ఓ అక్కగారు ఉయ్యాలో

మా అన్నలొచ్చారు ఉయ్యాలో

మమ్ము అంపుతారా ఉయ్యాలో

వస్తె వచ్చిరిగాని ఉయ్యాలో

ఏమి దెచ్చినారు ఉయ్యాలో

పాపడికి పట్టంగి ఉయ్యాలో

పలుదాగే గిన్నె ఉయ్యాలో

నాకు నల్లా చీరె ఉయ్యాలో

నెమలంచు రైకె ఉయ్యాలో

అందరికి తెచ్చిండ్రు ఉయ్యాలో

ఎంతో కొంత ఉయ్యాలో

నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో

మీ బావనడుగు ఉయ్యాలో

భారతము చదివేటి ఉయ్యాలో

బావ పెద్దా బావ ఉయ్యాలో

మా అన్నలొచ్చారు ఉయ్యాలో

మమ్ము అంపుతార ఉయ్యాలో

నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో

మీ అత్తనడుగు ఉయ్యాలో

కుర్చి పీటల మీద ఉయ్యాలో

కుర్చున్న ఓ అత్త ఉయ్యాలో

మా అన్నలొచ్చారు ఉయ్యాలో

మమ్ము అంపుతార ఉయ్యాలో

వస్తె వచ్చిరిగాని ఉయ్యాలో

ఏమి దెచ్చినారు ఉయ్యాలో

పాపడికి పట్టంగి ఉయ్యాలో

పలుదాగే గిన్నె ఉయ్యాలో

నాకు నల్లా చీరె ఉయ్యాలో

నెమలంచు రైకె ఉయ్యాలో

అందరికి తెచ్చిండ్రు ఉయ్యాలో

ఎంతో కొంత ఉయ్యాలో

నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో

మీ మామనడుగు ఉయ్యాలో

పట్టె మంచం మీద ఉయ్యాలో

పడుకున్న ఓ మామ ఉయ్యాలో

మా అన్నలొచ్చారు ఉయ్యాలో

మమ్ము అంపుతార ఉయ్యాలో

నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో

మీ వారినడుగు ఉయ్యాలో

రచ్చలో కుర్చున్న ఉయ్యాలో

రాజేంద్ర భోగి ఉయ్యాలో

మా అన్నలొచ్చారు ఉయ్యాలో

మమ్ము అంపుతార ఉయ్యాలో

ముడుచుకో కురులు ఉయ్యాలో

కట్టుకో చీరలు ఉయ్యాలో

పెట్టుకో సొమ్ములు ఉయ్యాలో

ఎత్తుకో పాపడిని ఉయ్యాలో

పొయిరా సుఖముగా ఉయ్యాలో

పుట్టినింటికినీ ఉయ్యాలో

4. Bathukamma Songs - Gangamma gauramma song | గంగమ్మ గౌరమ్మ పాట

గంగమ్మ గౌరమ్మ పాట


ఆ కడప ఈ కడప ఉయ్యాలో

ముత్యాల కడప ఉయ్యాలో

ముత్యాల కడప మీద ఉయ్యాలో

పగడాల ముగ్గు ఉయ్యాలో

పగడాల ముగ్గు పైన ఉయ్యాలో

శివుడొచ్చి కూర్చునే ఉయ్యాలో

శివుని కాళ్ళాకటుకు ఉయ్యాలో

గంగమ్మ గౌరమ్మ ఉయ్యాలో

గంగమ్మ గౌరమ్మ ఉయ్యాలో

ఏమేమి నోమిరి ఉయ్యాలో

ఒక సేరు బియ్యము ఉయ్యాలో

వజ్రాల పువ్వులు ఉయ్యాలో

రెందు సేర్ల బియ్యము ఉయ్యాలో

పసుపు కుంకుమా ఉయ్యాలో

మూడు సేర్ల బియ్యము ఉయ్యాలో

ముత్తైదవతనము ఉయ్యాలో

నాలుగు సేర్ల బియ్యము ఉయ్యాలో

నల్లాపూసలు ఉయ్యాలో

ఐదు సేర్ల బియ్యము ఉయ్యాలో

ఐదవతనము ఉయ్యాలో


3. Bathukamma Songs - Akka chellella Song | ఆక్క చెళ్ళెల్ల పాట

ఆక్క చెళ్ళెల్ల పాట 


కాటిక్క కాయల్లు ఉయ్యాలో

మనకేడీ వక్క ఉయ్యాలో

కన్నాడు మన తండ్రి ఉయ్యాలో

కన్నుల్ల తీరు ఉయ్యాలో

పెంచిండు మన తండ్రి ఉయ్యాలో

పెద్దా బుద్దుల్ల ఉయ్యాలో

ఇచ్చిండు మన తండ్రి ఉయ్యాలో

ఇల్లు వరసా చూసి ఉయ్యాలో

పడ్డాం మనమక్క ఉయ్యాలో

బలువైన ఇంట్ల ఉయ్యాలో

పట్టీనామనమక్క ఉయ్యాలో

బలువైన కొమ్మా ఉయ్యాలో

కొమ్మ కొమ్మన పండు ఉయ్యాలో

కొమ్మనా పండు ఉయ్యాలో

కొమ్మనా హర్షిణీ ఉయ్యాలో

గొలనిమ్మాపండు ఉయ్యాలో

ఆకు ఆకున పండు ఉయ్యాలో

ఆకునా పండు ఉయ్యాలో

ఆకునా అపూర్వ ఉయ్యాలో

అరటీ పండు ఉయ్యాలో

దాపు దాపున పండు ఉయ్యాలో

దాపునా పండు ఉయ్యాలో

దాపునా కిషొరు ఉయ్యాలో

దానిమ్మ పండు ఉయ్యాలో

సందు సందున పండు ఉయ్యాలో

సందునా పండు ఉయ్యాలో

సందునా హర్షినీ ఉయ్యాలో

సపోట పండు ఉయ్యాలో

మడత మడతన పండు ఉయ్యాలో

మడతనా పండు ఉయ్యాలో

మడతనా అపూర్వ ఉయ్యాలో

మామిడి పండు ఉయ్యాలో

తీగ తీగన పండు ఉయ్యాలో

తీగనా పండు ఉయ్యలో

తీగనా కిషొరు ఉయ్యాలో

తీరొక్క పండు ఉయ్యాలో

2. Bathukamma Songs - Seethamma Sreeraamulu Song | సీతమ్మ శ్రీరాములు పాట

 సీతమ్మ శ్రీరాములు పాట


సీతమ్మ శ్రీరాములు ఉయ్యాలో

సారీ బయలెల్లె ఉయ్యాలో

పారిజాతం పూలు ఉయ్యాలో

పరిమేళమిచ్చె ఉయ్యాలో

పోవయ్య రఘురామ ఉయ్యాలో

తేవయ్య పూలు ఉయ్యాలో

మన తోట కాదు సీత ఉయ్యాలో

మన్నెవారి తోట ఉయ్యాలో

మనకంటె మిక్కిలి ఉయ్యాలో

మన్నేవారెవరు ఉయ్యాలో

పోయెనే ఆ సీత ఉయ్యాలో

తోటా వద్దకు ఉయ్యాలో

కట్టుకున్న కై చీర ఉయ్యాలో

కాశల్లు పోసె ఉయ్యాలో

తొడుకున్న పట్టురైక ఉయ్యాలో

బొడ్లల్ల చెక్కె ఉయ్యాలో

కొమ్మాకదలాకుండ ఉయ్యాలో

చెట్టు ఎక్కినాది ఉయ్యాలో

ఆకు కదలాకుండ ఉయ్యాలో

పువ్వు తెంపినాది ఉయ్యాలో

అంతట్ల తోటమాలి ఉయ్యాలో

తోటా వద్దకు ఉయ్యాలో

తోటలున్నావారు ఉయ్యాలో

ఎవరమ్మా మీరు ఉయ్యాలో

శ్రీరాముల భార్యను ఉయ్యాలో

సీతాదేవిని ఉయ్యాలో

దశరథుని కోడల్ని ఉయ్యాలో

జనకుని పుత్రికను ఉయ్యాలో

అట్లైతె మా ఇంటికి ఉయ్యాలో

పెద్దా కోడలివి ఉయ్యాలో

హర హరా ఈ తోట ఉయ్యాలో

అగ్గయ్యి పోను ఉయ్యాలో

శివ శివా ఈ తొట ఉయ్యాలో

శిచ్చయ్యి పోను ఉయ్యాలో

బుగ బుగ ఈ తోట ఉయ్యాలో

బూడిదయ్యి పోను ఉయ్యాలో

శివుడికి ఈ పూలు ఉయ్యాలో

ఎక్కాక పోని ఉయ్యాలో

భూమ్మీద ఈ పూలు ఉయ్యాలో

పుట్టాక పోని ఉయ్యాలో

ముత్తైదువులు ఈ పూలు ఉయ్యాలో

ముడవకాపోని ఉయ్యాలో

1. Bathukamma Songs - Janaku Janaku Intla Uyyalo | జనకు జనకు నింట్ల ఉయ్యాలో


జనకు జనకు నింట్ల ఉయ్యాలో

సత్యజనకు నింట్ల ఉయ్యాలో

సీత పూట్టినాది ఉయ్యాలో

పుట్తుతా ఆ సీత ఉయ్యాలో

పురుడే గోరింది ఉయ్యాలో

పెరుగుతా ఆ సీత ఉయ్యాలో

పెండ్లే గోరింది ఉయ్యాలో

చిన్న చిన్న మొంటెలల్ల ఉయ్యాలో

చెరగానెర్చినాది ఉయ్యాలో

చిన్న చిన్న బొమ్మరిండ్లు ఉయ్యాలో

కట్ట నెర్చీనాది ఉయ్యాలో

చిన్న బొమ్మల పెండ్లి ఉయ్యాలో

చెయ్య నెర్చినాది ఉయ్యాలో

వెండియచాటలల్ల ఉయ్యాలో

చెరగానెర్చింది ఉయ్యాలో

పెద్ద పెద్ద బొమ్మరిండ్లు ఉయ్యాలో

కట్తా నెర్చింది ఉయ్యాలో

పెద్ద బొమ్మల పెండ్లి ఉయ్యాలో

చెయ్యా నెర్చింది ఉయ్యాలో

తూరుపు రాజులు ఉయ్యాలో

సీతనడగొచ్చిరి ఉయ్యాలో

విల్లు విరిస్తెగాని ఉయ్యాలో

ఇత్తుము సీతను ఉయ్యాలో

విల్లు విరవామాని ఉయ్యాలో

వీగి పొయిరి ఉయ్యాలో

దక్షిణపు రాజులు ఉయ్యాలో

సీతనడగొచ్చిరి ఉయ్యాలో

విల్లు విరిస్తెగాని ఉయ్యాలో

ఇత్తుము సీతను ఉయ్యాలో

విల్లు విరవామాని ఉయ్యాలో

తరలి పోయిరి ఉయ్యాలో

పడమటి రాజులు ఉయ్యాలో

సీతనడగొచ్చిరి ఉయ్యాలో

విల్లు విరిస్తెగాని ఉయ్యాలో

ఇత్తుము సీతను ఉయ్యాలో

విల్లు విరవామాని ఉయ్యాలో

అలిగిపోయిరి ఉయ్యాలో

ఉత్తరపు రాజులు ఉయ్యాలో

రామన్న, లక్ష్మన్న ఉయ్యాలో

సీతనడగొచ్చిరి ఉయ్యాలో

విల్లు విరిస్తెగాని ఉయ్యాలో

ఇత్తుము సీతను ఉయ్యాలో

విల్లు విరిచినాడు ఉయ్యాలో

పెండ్లి అయ్యినాది ఉయ్యాలో 

మార్చి 28, 2021

Sari, Base song - Marriage song - Telugu - సరి, బేస్ పాట (పెళ్ళి పాట)

సరి, బేస్ పాట (పెళ్ళి పాట)
========


బంగారు మెడగుండ్లవాణ్ణి గూడుకా

అంగాన చదురంగమాడితినమ్మా

అంగాన చదురంగమాడినచోట

ఆనిముత్యపుసిరులు ఓడితినమ్మా


ఎటుల మరతునే కృష్ణున్ని ఏమాని పిలతునే


పనతిరో రంగన్ని కూడితినమ్మా పచ్చీసులైనా ఆడితినమ్మా

పచ్చీసులైనా ఆడినచోట పగడాల హారాలు ఓడితీనమ్మా ||ఎటుల మరతునే||


వయ్యారి రంగన్ని కూడితినమ్మా ఓమనగుంతలు ఆడితినమ్మా

ఓమనగుంతలు ఆడినచోట వజ్రాల హారాలె ఓడితీనమ్మా ||ఎటుల మరతునే||


శంఖ,చక్రధారిని కూడితినమ్మా చెయిపట్టి పుంగీలు పూసితినమ్మా

చెయిపట్టి పుంగీలు పూసినచోట చేతిలొ పూబంతి ఓడితీనమ్మా ||ఎటుల మరతునే||


ఘుమ ఘుమ గంధము తీసితినమ్మా కృష్ణుడి మెడకైన పూసితినమ్మా ||ఎటుల మరతునే|| 

Samurtha Haarathi song - Telugu - సముర్థ పాట

సముర్థ పాట

===============

 సువ్వియనుచు పాడరమ్మా సుందరాంగిణి చూడరమ్మా


తెల్లచీరకట్టెనమ్మా, తెల్లరవిక తొడిగెనమ్మా

తోయజాక్షి ఎరగదమ్మా తల్లిచూసి చెప్పగానె

తలవంచి నవ్వెనమ్మా ||సువ్వియనుచు||


నవ్వు మాటే కాదేకొమ్మా నాతిసముర్తలాడేనమ్మా ||సువ్వియనుచు||


పచ్చీఅకు పరువరమ్మా పాలవెన్న తేగదమ్మా

పనతికి అందించరమ్మా ||సువ్వియనుచు||


విప్రవరున్ని పిలువరమ్మా విప్పి పంచాంగము చూడరమ్మా 

విప్పి పంచాంగము చూడగానే ఉత్తమైన నక్షత్రమమ్మా ||సువ్వియనుచు||


బంగారు పసిడి రోళ్ళ పసుపుకొమ్ము రోకలుంచి

పంచదార కొబ్బరేసి పనతులందరికీ పంచరమ్మా ||సువ్వియనుచు|| 

మార్చి 21, 2021

లక్ష్మీదేవి హారతి ​పాట - Lakshmi Devi haarathi song - Telugu Lyrics - Goddess Lakshmi

Photo By : http://www.flickr.com/photos/meanestindian/411558221/



లక్ష్మీ రావమ్మా మా ఇంటికి

శ్రీ రాజపుత్రి వరలక్ష్మీరావమ్మా మా ఇంటికీ

లక్క్ష్మీ పార్వతీ వాణీ రావమ్మా మా ఇంటికీ


సంపెంగ తైలముతెచ్చి సొంపూగ సిరసూలనంటి

మెత్తానీ కస్తూరీదెచ్చి మేగా పెట్టించెదనమ్మా ||లక్ష్మీ||


అందామైనా గవ్వంచుల చీర, బంగారు కొంగోళ్ళరైక

అండా అండా చిలుకలు చెక్కి

ఆభరణాల సొమ్ములు పెట్టి అలంకరించెదమమ్మా ||లక్ష్మీ||


చాయాపసుపు దీర్చేనమ్మా మంచి గంధం పూసేనమ్మా

మల్లెలు ముడిచేనమ్మా

అతివరో గౌరమ్మా నీకు అద్దమ్ము చూపించెదనమ్మా ||లక్ష్మీ||


సితిలేని సీతాఫలము మతిలేని మామిడిఫలము

కోరీనా కొబ్బరి ఫలము

అడిగీనా అరటిఫలము పనసా పండైనాగానీ 

వేళా మా ఇంట్లో నీకు నైవేధ్యము సరిపించెదనమ్మా ||లక్ష్మీ||


గౌరమ్మను తోలుకవచ్చి కుందానంపు

గద్దేమీదా అందూ కూర్చుండా బెట్టీ 

ఆకులు పోకలు చేతికి ఇచ్చి ఎప్పటికీ 

మా ఇంట్లొ ఉంటే తప్పాకా పూజించెదనమ్మా ||లక్ష్మీ|| 

సత్యనారాయణా స్వామి హారతి పాట - Satyanarayan Swami Haarathi Paatalu - 3 Songs - Telugu Lyrics


సత్యనారాయణా స్వామి హారతి పాట - 1
=========


సత్యనారాయణా స్వామికి మనమంతా నిత్యామంగళమానరే,

జనులారా సత్యామంగళామానరే ||సత్యనారాయణా||


ఆవుపేడలు తెచ్చి పచ్చాటి కళ్ళాపీచల్లి

పగడిముగ్గులు వేయారే, జనులారా పగడిముగ్గులు వేయారే ||సత్యనారాయణా||


తట్టుపీటలు తెచ్చి, పట్టుబట్టలు పరచి

సన్న బియ్యముపోయరే, జనులారా సన్న బియ్యముపోయరే ||సత్యనారాయణా||


ఛెంబు కలశముగట్టి, టెంకాయ పూజా చేసి

ఒంగి దండముచేయరే, జనులారా ఒంగి దండముచేయరే ||సత్యనారాయణా||


అర్ధశేరు గోధుమ రవ్వ, తీనుపావు పంచాదారా 

పండ్లుఫలహారములు కలుపరే, జములారా పండ్లుఫలహారములు ||సత్యనారాయణా||


కీరు పూరీ చేసీ నైవేద్యముజూపి, 

ఒక్కాపొద్దులు విడువరే, జనులారా ఒక్కాపొద్దులు విడువరే ||సత్యనారాయణా||


కోరినవారికి, కొడుకులను వరమిచ్చి 

కొటి సంపతి కలుగునే, జనులారా కొటి సంపతి కలుగునే  ||సత్యనారాయణా||


అడిగినవారికీ 

అధిక సంపతి కలుగునే, జనులారా అధిక సంపతి కలుగునే ||సత్యనారాయణా||


సత్యనారాయణా స్వామి హారతి పాట - 2
=========


సత్యనారాయణా పూజలుచేసిన

పాపం పరిహారం ఇలలో పాపం పరిహారం ||సత్యనారాయణా|| 


నిరతము, నిను కొలిచినవారికి

ఆశలు తీర్చెదవోదెవా ||సత్యనారాయణా||


పున్నమిరోజున, పుడమిలో జనులు

సత్యనారాయణా పూజలు చేసెదరు ||సత్యనారాయణా||


విష్ణువు నీవే బ్రహ్మవు నీవే మహేశ్వరుడవు నీవే

ఆరాగముతో అనురాగముతో

ఆశలు తీర్చెదవోదేవా ||సత్యనారాయణా||


సత్యనారాయణా స్వామి హారతి పాట - 3

=========


శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా

మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా ||శ్రీ||


నోచిన వారికి నోచిన వరము

చూసిన వారికి చూసిన ఫలము ||శ్రీ||


స్వామిని పూజించే చేతులే చేతులటా

మూర్తిని దర్శించే కనులే కన్నులటా

తన కథ వింటే ఎవ్వరికైనా జన్మతరించునటా ||శ్రీ||


వేళైనా, శుభమైనా కొలిచే దైవం దైవం

అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం ||శ్రీ||


అర్చన చేద్దామా, మనసు అర్పణ చేద్దామా

స్వామికి మదిలోనే, కొవెల కడదామా

పదికాలాలు పసుపు కుంకుమలు, ఇమ్మని కోరెదమా ||శ్రీ||


మంగళమనరమ్మా, జయమంగళమనరమ్మా 

కరములు జొడించి, శ్రీ చందనమనరించీ 

వందనమనరే సుందరమూర్తికి, వందనమనరమ్మా ||శ్రీ||





Krishna Haarathi Song | కృష్ణుడి హారతి పాట

  జయ జగదీశ హరే కృష్ణా జయ జగదీశ హరే ------------------ జయ జగదీశ హరే కృష్ణా జయ జగదీశ హరే జయ గురు మారుత మందిరనాథా జయ జగదీశ హరే కింకిణి పదకమలా క...