నవంబర్ 13, 2020

మంగళ గౌరి హారతి పాట - Mangala Gowri Haarathi Song



దేవీ మంగళ గౌరి మంగళ హారతి ప్రేమతో గైకొనవమ్మ మాయమ్మ

దేవీ మంగళ గౌరి మంగళ హారతి ప్రేమతో గైకొనవమ్మ మాయమ్మ


పంచామృతములు, ఫలహారములను 

నైవేద్యములిచ్చితిమి

పలుపలు విధముల పకువన్నములను

ప్రేమతో సమకూర్చితిమి, 

నీకొరకై ప్రేమతో సమకూర్చితిమి

మాతా విను మా గాధా 

మా కోరికలన్నియు తీర్చుమా 

గైకొనవమ్మ మాయమ్మ || దేవీ ||


సకల సుఖములను, సౌభాగ్యములను 

ఒసగుము జననీ

శుభసంతానమునిచ్చియు కరుణించుము కదలమణి

దయగనుమ, మా మొర వినుమా 

ఇక పాతివ్రత్యము నీయుమ

గైకొనవమ్మ మాయమ్మ || దేవీ ||


భవభయహారిణి, వరదాయనివని

జనులందరు కొలిచెదరు

సంతతి ధారిణి దుఖః నివారిణి 

మనసున పూజించెదరు 

మృదువాణి, పంకజపాణి 

గొవిందుని హృదయ నివాసిని

గైకొనవమ్మ మాయమ్మ || దేవీ ||



——



క్రృష్ణుడి హారతి పాట - హారతిదిగో శ్రీధరా - Haarathidigo Sreedharaa

 


హారతిదిగో శ్రీధరా కావుమయ్య గిరిధరా రుక్మిణీ తోడనీవు హారతందుకోవయ్య

రుక్మిణీ తోడనీవు హారతందుకోవయ్య



మల్లెలు మొల్లలు మంచి విరాజాజులు

మల్లెలు మొల్లలు మంచి విరాజాజులు

పారిజాత పుష్పములను మాల గ్రుచ్చి వేసెదా

పారిజాత పుష్పములను మాల గ్రుచ్చి వేసెదా

||హారతిదిగో శ్రీధరా||


చిన్ని క్రృష్ణ లీలలు ఎంచినా తరము కాదు

చిన్ని క్రృష్ణ లీలలు ఎంచినా తరము కాదు

వేల్ప వేల్పు చెప్పగా వేయి నోళ్ళు చాలవు

వేల్ప వేల్పు చెప్పగా వేయి నోళ్ళు చాలవు     

||హారతిదిగో శ్రీధరా||


——

శ్రీ చక్ర పురం హారతి పాట - Chakrapuram Haarathi Song - Telugu

శ్రీ చక్ర పురమందు స్థిరమైన శ్రీ లలిత

పసిమి పాదాలకు నీరాజనం

పరమేశ్వరుని పుణ్య భాగ్యాలరాశీ,

సింహమధ్యకు నీరాజనం


బంగారు హారాలు శింగారమొలకించు

అంబికా హృదయాన నీరాజనం

శ్రీ గౌరి, శ్రీ మాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీ

సింహాసనేశ్వరికి నీరాజనం


కల్పతరువుగా నన్ను కాపాడె, కరములకు

కనకాంబురాశులతో, నీరాజనం

పాశాంకుశ, పుష్ప, బాణ చావదలికి

పరమపావనమైన నీరాజనం


కాంతి కిరణాలతో, కలికి మెడలో మెరిసే

కళ్యాణ సూత్రముకు నీరాజనం

కాంతలందరి పసుపుకుంకుమలు కాపాడె

కాత్యాయనికి నిత్య నీరాజనం


చిరునవ్వులొలికించు శ్రీదేవి అధరాన

శతకోటి నక్షత్ర నీరాజనం

కలువరేకులవంటి కన్నుల తల్లికి శ్రీ

రాజ రాజేశ్వరికి నీరాజనం


ముదమార మోమున ముచ్చటగా ధరియించు

కస్తూరి కుంకుమకు నీరాజనం

చంద్రవంకను శిరమకుటంబులోదాల్చు

సౌందర్యలహరికి నీరాజనం


శుక్రవారము నాడు శుభము లొసగే తల్లి

శ్రీ మహాలక్ష్మికి నీరాజనం

శృంగేరి పీఠమున సుందరాకారిణి

శారదా మాతకు నీరాజనం


ఎల్లలోకాలను చల్లగా పాలించు

బ్రహ్మాండరూపిణికి నీరాజనం

ముగ్గురమ్మలకు మూలమైన పెద్దమ్మకు

ముత్యాల తోనిచ్చే నీరాజనం


రాగ జీవన రాగ నామ సంకీర్తనగా

రంజిల్లు కర్పూర నీరాజనం

జన్మజన్మలతల్లి జగదీశ్వరీ నీకు

భక్త జనులిచ్చేటి నీరాజనం ||శ్రీ చక్ర||



——

క్షీరాబ్ధి కన్యకకు హారతి పాట - Ksheerabdhi Kanyaka Haarathi Song - Telugu

 

క్షీరాబ్ధి కన్యకకు శ్రీమహాలక్ష్మికి

నీరజాలయమునకు నీరాజనం


జలజాక్షి మోమునకు జక్కపకుచంబులకు

నెలకొన్న కప్పురకు నీరాజనం

అలివేణి తిరుమునకు హస్తకమలంబులకు

నిలువు మాణిక్యముల నీరాజనం ||క్షీరాబ్ధి కన్యకకు||



పగటు శ్రీవేంకటేశు పట్టపురాణియై

నెగడు సతికళలకును నీరాజనం

జగతి అలమేల్మంగ చక్కదనములకెల్ల

నిగుడు నిజశోభనపు నీరాజనం ||క్షీరాబ్ధి కన్యకకు||


——


శ్రీ లలితా హారతి పాట - Sri Lalitha Haarathi Song - Telugu

 

శ్రీ లలితా శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి

నిలయ నిరామయా సర్వమంగళా ||శ్రీ లలితా||


జగముల చిరునగవుల పరిపాలించే జననీ

అనయము మము కనికరమున కాపాడే జననీ

మనసే నీ వశమై స్మరణే జీవణమై

మాయని వరమీయవే పరమేశ్వరి మంగళ నాయకి ||శ్రీ లలితా||


అందరికన్నా చక్కని తల్లికి సూర్య హారతీ

అందాలేలే చల్లని తల్లికి చంద్ర హారతీ

రవ్వల తళకుల కలకల లాడే కర్పూర హారతీ

సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళ హారతీ ||శ్రీ లలితా||


లోకాలేలే చల్లని తల్లికి చంద్ర హారతీ

రవ్వల తళకుల కళాజ్యోతుల కర్పూర హారతీ ||శ్రీ లలితా|| 



——

జననీ శివకామిణీ - Janani Sivakamini Song - Telugu

 జననీ శివకామిణీ జయ శుభ కారిణి విజయ రూపిణి ||జననీ శివకామిణీ||


1. అమ్మవు నీవే అఖిలజగాలకు

అమ్మలగన్న అమ్మవు నీవే

నీ చరణములే నమ్మితినమ్మా

శరణము కోరితిమమ్మా భవానీ ||జననీ శివకామిణీ||


2. నీ దరినున్నా తొలగుభయాలు

నీ దయ ఉన్నా కలుగు జయాలు

నిరతము మాకు నీడగ నిలిచి

జయమునీయవే అమ్మా భవానీ ||జననీ శివకామిణీ||



——


అన్నపూర్ణా దేవి హారతి పాట - Annapoorna Devi Haarathi Song - Telugu

 అన్నపూర్ణా దేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా

విష్వైకనాథుడే విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంటా

నా తనువునోతల్లి, నీ సేవ కొరకు అర్చింతునోయమ్మ పైజన్మవరకు


నా తనువు అచలాంష నీ పురము చేరి నీ పాదముద్రతో నెగడాలి తల్లి ||అన్నపూర్ణా దేవి||


నా తనువు ఉధకాంశ నీ వీడు చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి ||2||

నా తనువు తేజోంశ నీ గుడికి చేరి నీ ముందు దివ్వెగా నిలవాలి తల్లి ||2||

||అన్నపూర్ణా దేవి||


నా తనువు మరుదంశ నీ గుడికి చేరి నీ చూపు కొసలతో విసరాలి తల్లి ||2||

నా తనువు గగనాంశ నీ మనికి చేరి నీ నామ గానాలు మ్రోయాలి తల్లి  ||2||

||అన్నపూర్ణా దేవి||



——

Krishna Haarathi Song | కృష్ణుడి హారతి పాట

  జయ జగదీశ హరే కృష్ణా జయ జగదీశ హరే ------------------ జయ జగదీశ హరే కృష్ణా జయ జగదీశ హరే జయ గురు మారుత మందిరనాథా జయ జగదీశ హరే కింకిణి పదకమలా క...